Aug 21,2023 07:05

కవి, రచయిత చలపాక ప్రకాష్‌ కేంద్రప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెల్‌షిప్‌కు ఎన్నికయ్యారు. 2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్‌ 'తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం' అంశంపై 2 సంవత్సరాలపాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది. ఈ పరిశోధనకుగాను ప్రకాష్‌కు రెండేళ్లపాటు నెలకు రూ.20 వేలు చొప్పున గౌరవ వేతనంగా అందిస్తారు. గతంలో ఇదే సాంస్క ృతిక మంత్రిత్వ శాఖ నుంచి 'అత్యాధునిక కవితారూప ప్రక్రియ-నానీ' అనే అంశంపై పరిశోధన చేసి చలపాక జూనియర్‌ ఫెలోషిప్‌ అందుకున్నారు.