Nov 01,2023 17:26

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ :67వ స్కూల్‌ గేమ్స్‌ లో భాగంగా ఈ నెల 2 తేదీ నుంచి 10 తేదీ వరకు వివిధ క్రీడా అంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారని స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఎల్‌ వి రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
'2వతేదీన టెన్నిస్‌ అండర్‌14,17 బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ విజయనగరం లో రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో నిర్వహ్చింనున్నారు.
3వతేదీన హాండ్‌ బాల్‌ అండర్‌-14, బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ ,విజయనగరంలో రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
3వతేదీన సేపక్‌ తక్రా అండర్‌-14,17 బాలురు , బాలికల జిల్లా స్థాయి సెలక్షన్స్‌ జెడ్పీ హై స్కూల్‌ విటి అగ్రహారం లో నిర్వహించనున్నారు.
4వతేదీన నెట్‌ బాల్‌ అండర్‌-14, 17 బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ జెడ్పీ హై స్కూల్‌ గడసాం, దత్తిరాజెరు మండలంలో నిర్వహించనున్నారు.
6వతేదీన ఖో - ఖో అండర్‌ 14, 17బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ జెడ్పీ హై స్కూల్‌ కోనేరు లో నిర్వహించనున్నారు.
7వతేదీన కబడ్డీ అండర్‌-14, 17బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ జెడ్పీ హై స్కూల్‌ అలుగొలు,నెల్లిమర్ల మండలంలో నిర్వహించనున్నారు.
10వతేదీన అథ్లెటిక్స్‌ అండర్‌-14, 17బాల బాలికల జిల్లా సెలక్షన్స్‌ రాజీవ్‌ క్రీడా ప్రాంగణం విజయనగరం లో నిర్వహించనున్నారు.' అని ప్రకటనలో తెలిపారు.