Oct 31,2023 22:05

రోమ్‌: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఫిఫా) ఆతిథ్య హక్కులు మరోదఫా ఆసియా ఖండానికి చెందిన మరో దేశానికి దక్కనున్నాయి. 2034 ఆతిథ్య హక్కులకోసం బిడ్‌లను దాఖలు చేసేందుకు అక్టోబర్‌ 31 ఆఖరు తేదీ కాగా.. ఆసియా ఖండానికి చెంందిన ఒక్క సౌదీ అరేబియా బిడ్‌ను దాఖలు చేసింది. మంగళవారం 2034 ఫిఫా ఆతిథ్యంకోసం బిడ్‌ వేసే ప్రక్రియ తాము వైదొలుగుతున్నట్లు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌ క్రీడను విస్తరించాలనే ఉద్దేశ్యంతోనే ఆస్ట్రేలియా దూరంగా నిలిచినట్లు సమాచారం. ఇక 2030 ఫిఫా ప్రపంచకప్‌ను మొరాకో, స్పెయిన్‌, పోర్చుగల్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 2022 ఫిఫా ప్రపంచకప్‌కు ఆసియా ఖండానికి చెందిన కతార్‌ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.