ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని ఏడిద సీతానగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ వరదా లక్ష్మి (85) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉప సర్పంచ్ వరదా చక్రవర్తి ఆమె రెండవ కుమారుడు. వరదా లక్ష్మి భర్త వరదా గణపతి ఉమ్మడి ఏడిద గ్రామ పంచాయతీలో సభ్యులు, ఉప సర్పంచ్ గా పనిచేశారు. సీతా నగరం గ్రామాన్ని ఏడిద పంచాయతీ నుండి విడదీయడంలో ఆయన కీలకపాత్ర వహించారు. సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జడ్పీటీసీ సభ్యురాలు కుడుపూడి భవానీ రాంబాబు, ఎంపీపీ వుండమట్ల శ్రీనివాస్, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, ఎంపీటీసీ అడ్డాల శ్రీదేవీ రామరాజు, వైసిపి నాయకులు వేగిరాజు సురేష్ రాజు, వైసీపీ లీగల్ సెల్ కన్వీనర్న్యాయవాది టివి గోవిందరావు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.










