Oct 12,2023 19:30

సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ట్రీట్‌మ్మెంట్‌ కూడా తీసుకుంటున్నారు. 'ఖుషీ' సినిమా తరువాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆమె, తన చేతికి డ్రిప్స్‌ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆసుపత్రి బెడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పంచుకుంటూ.. మందుల వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి ఓ పోస్ట్‌ చేశారు. ఈ డ్రిప్సే తనకు కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని తెలిపారు.