Nov 14,2023 08:41

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌:విజయనగరంలోని కంటోన్మెంట్‌ మున్సిపల్‌ హైస్కూలులో పదో తరగతి చదువుతున్న జి.సాకేత్‌ జాతీయ స్థాయి అండర్‌-17 స్కూల్‌ గేమ్స్‌ స్విమ్మింగ్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ తరుఫున ఎంపికయ్యాడు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమింగ్‌ పోటీలలో విజయనగరం జిల్లా జట్టు తరుపున కంటోన్మెంట్‌ పాఠశాల విద్యార్థులు జి.సాంకేత్‌, బి.తేజమణిరాయ్ పాల్గొన్నారు. ఈ పోటీలలో 1/17 విభాగంలో సాకేత్‌ 50 మీటర్ల బట్టర్‌లోనూ, వంద మీటర్ల బట్టర్‌లోనూ బంగారు పతకాలు సాధించాడు. 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో వెండి పతకం కైవసం చేరుకున్నాడు. డిసెంబరులో న్యూఢిల్లో జరగనున్న జాతీయస్థాయి స్మిమ్మింగ్‌ పోటీలకు మూడు కేటగిరీలలో ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాకేత్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.కాంచన, పిజికల్‌ డైరెక్టర్‌ శేఖర్‌, పిఇటి ప్రమీల, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.