Oct 30,2023 11:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ (కోట) : విజయనగరం రైలు ప్రమాదంలో దాదాపు 100మందికిపైగా బాధితులు క్షతగాత్రులయ్యారు. వారంతా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు రక్తదానం చేశారు. 15మంది అత్యవసర రక్తదానం చేశారు.

111


         జిల్లాలోని కంటకాపల్లి - అలమండ ప్రాంతం మధ్య ఉన్న చిన్నరావుపల్లి ప్రాంతం వద్ద నిన్న రాత్రి రెండు రైళ్లు ఢకొీని పెనుప్రమాదం జరిగిందని, వీటిలో మఅతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దీనికి కారణమైన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎస్‌ఎఫ్‌ఐ-డివైఎఫ్‌ఐ ఖండించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ రావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్‌.హరీష్‌ మాట్లాడుతూ .... ఒడిశాలోని బాలాసోర్‌ రైలు దుర్ఘటన మరవక ముందే మరోసారి రైలు ప్రమాదం వాటిల్లిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిరుద్యోగ, ప్రైవేటీకరణ విధానాల వల్లే ఈ ప్రమాదానికి కారణమని సరైన సిగల్‌ సిబ్బంది, రైల్వే తదితర సిబ్బంది అందుబాటులో లేక ప్రమాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. నిన్న జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు అవసరమైన రక్తాన్ని అత్యవసర సమయంలో 15 మంది నేతలు రక్తదాతలుగా రక్తం అందించి వారి ప్రాణాలు నిలపడానికి కారణమయ్యారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అవసరమైన రక్తాన్ని అందించడానికి జిల్లాలో ఉన్న రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. వారికి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకువాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సీహెచ్‌.వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు సీహెచ్‌.పావని, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, సౌమ్య, రవి, జిల్లా కమిటీ సభ్యులు సోమేశ్‌, లావణ్య, రమేష్‌, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.