చైనా : రష్యా అధ్యక్షుడు వ్లాదిపూర్ పుతిన్ మంగళవారం చైనాలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో చైనాలోని బీజింగ్‌కు పుతిన్ చేరుకున్నారు. డ్రాగన్ కంట్రీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతోన్న సందర్భంగా .... దీనిని పురస్కరించుకుని బీజింగ్‌లో అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. పుతిన్‌ను ఆహ్వానించారు. చైనా మంత్రులు, ఉన్నతాధికారులు పుతిన్‌కు స్వాగతం పలికారు. బీజింగ్ తన ప్రపంచ ప్రభావాన్ని విస్తరించడానికి ఉపయోగిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రెసిడెంట్ జి మైలురాయి ప్రాజెక్ట్ ఫోరమ్ కోసం చైనా ఈ వారం 130 దేశాల ప్రతినిధులను స్వాగతించింది. పుతిన్ రేపు (బుధవారం) చర్చల కోసం జిన్‌పింగ్‌ను కలవబోతున్నారు. ఈ చర్చలలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ప్రత్యేక దఅష్టి సారిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.