మాస్కో : కీవ్ లక్ష్యంగా రష్యా ఈ నెలలో ఆరవ వైమానిక దాడిని ప్రారంభించింది. అయితే, ఉక్రెయిన్ లోపలికి వచ్చిన డ్రోన్‌లన్నింటినీ కూల్చివేశామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారికంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రష్యా లోపల జరుగుతున్న దాడులకు అమెరికా మద్దతు ఇవ్వదని మాస్కోపై ఆరోపించిన దాడి గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. స్థానిక రైతులను రక్షించడానికి, ఉక్రెయిన్ ధాన్యంపై ఆంక్షలను విస్తరించడానికి ఈయూ చేసే ఏ చర్య అయినా ఆమోదించలేనిదని, యూరోపియన్ వ్యతిరేకం అని అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ చెప్పారు. ఇదిలా ఉండగా.. బ్లాక్ సీ ఫ్లీట్ షిప్‌లలో ఒకటి రాత్రిపూట దాడి చేయడానికి ప్రయత్నించిన రెండు మానవ రహిత ఉక్రేనియన్ నావికా డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.










