
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : బాణాసంచా కొనుగోలు, అమ్మకాలు చేసే దుకాణదారులు, వినియోగదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఎస్సై ఎల్.శ్రీను నాయక్, మండపేట ఫైర్ ఆఫీసర్ జె.హనుమంతరావు, డిప్యూటీ తహసిల్దార్ జానకి రామయ్య అన్నారు. మండలంలో బాణాసంచా అమ్ముకునేందుకు దరఖాస్తు చేసుకున్న దుకాణదారుల స్థలాలను వారు శుక్రవారం పరిశీలించారు. అమ్మకాలు జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా భద్రతలు పాటించాలని సూచించారు.