
గూడూరు (తెలంగాణ) : తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై మహబూబాబాద్ జిల్లా గుడూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. బిఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున మంత్రి సత్యవతి ప్రచారం చేస్తున్నారు. కొంగరగిద్దలో ప్రచారానికి మంత్రి వెళ్లారు. సత్యవతి రాథోడ్ కు మంగళ హారతితో బిఆర్‌ఎస్ మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టి బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.