
నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామలో అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ .... నందిగామ జర్నలిస్టులు సోమవారం నందిగామ ఆర్డీవో పి. సాయిబాబా కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ఇళ్ళ స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేసి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు వేజ్ బోర్డు ద్వారా కనీసం నెలకు రూ.15,000 ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, హెల్త్ కార్డు లు ఇవ్వాలన్నారు. నందిగామలో డివిజనల్ పిఆర్‌ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల వెల్ ఫేర్ అసోసియేషన్ నందిగామ అద్యక్షుడు వెలది సుగుణ శేఖర రావు, జర్నలిస్టుల సంఘాల నాయకులు ఎవి నారాయణ, పఠాన్ మీరా హుస్సేన్ ఖాన్, పాలడుగు సాంబశివరావు, మ్నెవ్వ అనిల్ కుమార్, సత్య నారాయణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.