Sep 25,2023 11:27

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ... సోమవారం అమరావతిలోని మ్యూజియం సెంటర్లో టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కన్యధార.వసంతరావు మాట్లాడుతూ ... చంద్రబాబు నాయుడును ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేసిందని, ఎలాంటి అవినీతి మచ్చ లేని వారు చంద్రబాబు అని అన్నారు. కావాలనే కక్షపూరితంగా చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.