ప్రజాశక్తి -రైల్వేకోడూరు:టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ దుర్మార్గమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రెండవ రోజు పార్టీ కార్యాలయం వద్ద కస్తూరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ ఎంతోమంది నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారని అలాంటి వ్యక్తిని ఈరోజు అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడనున్నారని ఆయన అన్నారు దీక్షలో పార్టీ నాయకులు కమతం నాగరాజు,కట్ట గుండయ్య,కొమ్మ శివ,వెంకటేష్,కేకే చౌదరి,చిన్న, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.










