Nov 14,2023 21:33

ప్రజాశక్తి- రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా):అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రానికి చెందిన ముప్పన పవిత్ర ఎయిమ్స్‌లో ప్రతిభ కనబరిచింది. ఇటీవల విడుదలైన ప్రవేశ పరీక్షల్లో 99.5 శాతం మార్కులు పొంది 304వ ర్యాంకు సాధించింది. ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేసింది. తాజా ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌ కళాశాలలో వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయడమే తన లక్ష్యమని పేర్కొంది. తన కుమార్తె ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని ఆమె తండ్రి అమర్‌నాథ్‌ మీడియాకు తెలిపారు.