హైదరాబాద్: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్, బోరబండ పరిధిలో వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీలోని తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జాం నెలకొంది. హైద్రాబాద్ సహా శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరోవైపు, వర్షాలపై హైదరాబాద్ వాసులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. రేపు (మంగళవారం) ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. సహాయక చర్యల కోసం 040 21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.










