Oct 01,2023 13:49

హృదయమే లేకుంటే..
ఈ ఉరికోతలే ఉండవుగా,
ఊపిరే లేకుంటే..
ఈ ఉనికే ఉండదుగా!
ఆకాశమంత అనురాగాన్ని
పిడికెడంత గుండెలో ఎలా దాచేది?
భూగోళమంత బరువును
అరచేతిలో కొలిచి ఎలా చూపేది?
లోలోతున దాగిన సముద్రం
కంటికి మాత్రమే తెలుసు!
ఎగసే అలల వేదన
అదుపులో పెట్టే రెప్పలకే తెలుసు!
మనసు కరిగిపోయినా
గడ్డ కట్టుకుపోయినా..
ఏమాత్రం పట్టించుకోని కాలం
సమాధానం ఇవ్వలేని
ఎన్నో ప్రశ్నలను సంధిస్తుంది!
 

- పుట్టి గిరిధర్‌
9494962080