బ్యూనస్ ఎయిర్స్ : అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహాలోనే అర్జెంటీనాలో జరిగిన ఘటనపై ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. గత వారాంతంలో రాజధానిలో శాంతియుతంగా జరిగిన చిన్న ప్రదర్శనపై సిటీ పోలీసులు పైశాచికంగా దాడి చేశారు. ఈ ప్రదర్శన వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకున్నా ఒబెలిస్క్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఫకుండో మోలారెస్‌ను రాజధాని నగర పోలీసులు పట్టుకుని, అతని తలను నేలపై ఆన్చి ఉంచి, అతని చేతులను వెనుకకు తిప్పి గట్టిగా అదిమి చంపారన్న వార్త తెలియగానే అర్జెంటీనా ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఫొటో జర్నలిస్టు మొలారెస్ మృతికి బాధ్యులైన పోలీసులను శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.ఈ కేసులో మొలారెస్‌కు న్యాయం చేయాలని వారు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఆదివారం అర్జెంటీనాలో ప్రైమరీస్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా రెబెలియన్ పాపులర్ గ్రూపునకు చెందిన కార్యకర్తలు,ఇతర ప్రజాతంత్రవాదులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సిటీ పోలీసుల నేరపూరిత వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రోడ్రిగ్జ్ లారెటా పేర్కొహ్యూగో కాచోరో గోడోరు.డిప్యూటీ సెక్రటరీ, రికార్డో పెయిడ్రో మాట్లాడుతూ, మొలారెస్‌ది రాజ్యం చేసిన హత్య అని చెప్పారు..''ఫకుండో మొలారెస్‌ను పోలీసు బలగాలు నేలపై పడవేసి అదిమి చంపడాన్ని పలు సామాజిక సంస్థలు ఖండించాయి వారు అతడ్ని కాళ్ళతో తారుపై నొక్కారు, తన్నారు. అని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అక్టోబరు 22న జరిగే సాధారణ ఎన్నికలలో పోటీ చేయగలిగే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రైమరీస్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు.