Oct 08,2023 13:27

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని భీమవరం ఆర్టీసి డిపో మేనేజర్‌ గిరిధర్‌ కుమార్‌ అన్నారు. శ్రీ విజ్ఞానవేదిక అధ్వర్యంలో ఆర్టీసి గ్యారేజ్‌ ప్రాంగణంలో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డిపో మేనేజర్‌ గిరిధర్‌ కుమార్‌ మాట్లాడుతూ ... ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం మంచి కార్యక్రమం అని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ... కంతేటి సత్యవతమ్మ పేరిట వారి కుటుంబ సభ్యుల సహకారంతో 28 మొక్కలను ఆర్టీసి గ్యారేజ్‌ కి అందిచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్‌ ఏఎన్‌ ఎఫ్‌ ఎస్‌ కోటేశ్వరరావు, సెక్యూరిటీ గణపతి పాల్గొన్నారు.