Nov 19,2023 07:58

మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించాలి. కాలుష్యాన్ని నివారించే దిశగా చర్యలు చేపట్టాలి. ప్లాస్టిక్‌ భూమిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల భూమి కలుషితమై, మానవాళి నాశనానికి దారితీస్తుంది. అందుకే చెట్లను పెంచాలి. లేకపోతే ఆక్సిజన్‌ సరిపోయినంతా ఉండదు. రోడ్ల వెంట మొక్కలను నాటాలి. మన జీవన విధానంలోనూ మార్పు చేసుకోవాలి. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా గుడ్డ సంచులను వాడటం వల్ల కొంతమేరకైనా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
అంతేకాదు.. అడవులను నరకకూడదు. నరికినా ఆ స్థానంలో ఒక మొక్కను పెంచాలి. ఇళ్ల మధ్య కూడా చిన్న చిన్న మొక్కలను పెంచాలి. లేవగానే పచ్చని చెట్లను చూడటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎక్కువగా చెట్లను పెంచితే వర్షాలు కూడా బాగా కురుస్తాయి. దాంతో పంటలూ బాగా పండుతాయి. మొక్కలను నాటడమే కాకుండా, వాటికి ప్రతిరోజూ నీళ్లు పోయాలి. కాబట్టి మన పర్యావరణాన్ని బాధ్యతగా మనమే కాపాడుకోవాలి.

పి. వెంకట అక్షయ,
7వ తరగతి,ఎస్‌కెఎస్‌ జెడ్పిహెచ్‌ఎస్‌,
మురికిపూడి, చిలకలూరి పేట, పల్నాడు జిల్లా.