ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : తిరుపతి జిల్లా ఆటో కార్మిక యూనియన్ ప్రధమ మహాసభ ఆగస్టు 27న శ్రీకాళహస్తిలో జరగనుంది. ఈ సందర్భంగా సూళ్ళూరుపేటలో కరపత్రాలను తిరుపతి జిల్లా ఆటో కార్మిక నాయకులు మురళి, సిఐటియు నాయకులు కె.లక్ష్మయ్య విడుదల చేసి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇయస్‌ఐ, పియఫ్‌తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోలు, డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, ఆర్టీఒ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు ఆపాలని, పెంచిన చలాన చార్జీలు ఉపసంహరించాలని, ప్రవేటు రుణాలు రద్దు చేసి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని తదితర 16 డిమాండ్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమములో బి.పద్మనాభయ్య. పి.మనోహరం ఆటో కార్మిక నాయకులు సుందరరాజ, చంద్రయ్య, రమణయ్య, రఘు, కరీమ్, మునిక్రిష్ణ తదితర ఆటో కార్మికులు పాల్గొన్నారు.










