ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ముందు జాగ్రత్త చర్యలతో అగ్ని ప్రమాదాలు నివారించ వచ్చిన మండపేట అగ్నిమాపక అధికారి జె. హనుమంతరావు అన్నారు. శుక్రవారం స్థానిక అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవీంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ తేదీ వరకు జరిగే ఈ వారోత్సవాలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అగ్ని మాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










