Nov 15,2023 22:10

జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
టోక్యో: జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సూపర్‌500లో పురుషుల సింగిల్స్‌ భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో హెచ్‌ఎస్‌ ప్రణరు రాయ్ పోరాడి విజయం సాధించగా.. లక్ష్యసేన్‌, ప్రియాన్షు రాజ్‌వత్‌ ఓటమిపాలయ్యారు. 7వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణరు రాయ్ 22-0, 19-21, 21-17తో లీాఛౌక్‌ాయు(హాంకాంగ్‌)పై చెమటోడ్చి నెగ్గాడు. తొలి గేమ్‌ను హోరాహోరీగా నెగ్గిన ప్రణరు.. రెండో గేమ్‌ను విజయానికి చేరువలో చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 21-17తో ముగించి మ్యాచ్‌ను ముగించాడు. ఇక ప్రియాన్షు రాజ్‌వత్‌ 15-21, 12-21తో లిన్‌ాచెన్‌ాహి(చైనీస్‌ తైపీ) చేతిలో, లక్ష్యసేన్‌ 17-21, 10-21తో 3వ సీడ్‌ కోడల్‌ నరౌకా(జపాన్‌) చేతిలో ఓటమిపాలయ్యారు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌-సాత్విక్‌ జోడీ తొలిరౌండ్‌లోనే అనూహ్యంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.