Oct 18,2023 09:42

కొల్‌కతా : నయా ఫాసిజంపై పోరాటం కొనసాగించాలని సిపిఐ(ఎం) అగ్ర నాయకులు ప్రకాశ్‌ కరత్‌ పిలపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడడం, దేశంలో మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం వేర్వేరు కాదు. అక్కడ బెంజమిన్‌ నెతన్యాహు, ఇక్కడ మోడీ ఒకే విధమైన నయా ఫాసిస్ట్‌ పాలన సాగిస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు అమెరికా సామ్రాజ్యవాదానికి సన్నిహిత మిత్రులు అని కరత్‌ విమర్శించారు. పాలస్తీనా విమోచనా పోరాటానికి ఎప్పటిలానే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన కమ్యూనిస్టు పార్టీ 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడిక్కడ నిర్వహించిన సదస్సులో కరత్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నేత బిమన్‌బసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీమ్‌ కూడా పాల్గొన్నారు. అక్కడ పాలస్తీనీయులను నెతన్యాహు ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తుంటే, ఇక్కడ మోడీ నేతత్వంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఈ దేశంలోని ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కరత్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం, రాజ్యాంగం లేదా రాజ్యాంగ హక్కులు - అన్నీ నాశనం చేసేందుకు నిరంకుశ మోడీ ప్రభుత్వం తెగబడుతున్నట్టే, పాలస్తీనా ప్రజల హక్కులను కాలరాసేందుకు అక్కడ జాత్యహంకార నెతన్యాహు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా ప్రత్యక్ష మద్దతుతో ఇజ్రాయిల్‌ తన ఆక్రమణ సాగిస్తుంటే, దానికి మోడీ వంతపాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇక్కడ పావులు కదుపుతుంటే, అక్కడ నెతన్యాహు ప్రభుత్వం ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాన్ని తీసుకొచ్చిందని కరత్‌ పేర్కొన్నారు. నెతన్యాహు చర్యపై ఇజ్రాయిల్‌ ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాలస్తీనాకు అండగా నిలబడితే.. ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టుగా మోడీ ప్రభుత్వం వాదించడం సిగ్గుచేటు అన్నారు. . ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించినా, విమర్శించినా ఉగ్రవాది అని ముద్ర వేసి జైలులో పెడుతున్నారు. కాశ్మీరీయులపైన జర్నలిస్టులపైన,, ప్రతిపక్ష నేతలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి నయా ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా 1948లో రెండు దేశాల ఏర్పాటుకు సిపిఐ(ఎం) మద్దతు ఇస్తుందని అన్నారు. ''పాలస్తీనీయుల పోరాటాన్ని యూదులకు ముస్లింలకు మధ్య పోరాటంగా ఇక్కడి వారి అనుచరులు చిత్రిస్తున్నారని, ఇది సరికాదని సిపిఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం అన్నారు ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా యూదులతో సహా వివిధ విశ్వాసాలకు చెందిన ప్రజలు ర్యాలీ చేస్తున్నారు. స్వతంత్ర పాలస్తీనా డిమాండ్‌కు మద్దతిచ్చే హిందూ ప్రగతిశీల వాదులు ఇజ్రాయెల్‌ ప్రజల కంటే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిలీయుల్లో చాలా మంది బహుళత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
              బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వలస పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు నిబద్ధతతో సాగించిన పోరాటాన్ని బిమన్‌ బసు గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అటువంటి దఢ సంకల్పం ఈరోజు మళ్లీ అవసరమని ఆయన అన్నారు. కదుపుతుంటే, అక్కడ నెతన్యాహు ప్రభుత్వం ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాన్ని తీసుకొచ్చిందని కరత్‌ పేర్కొన్నారు. నెతన్యాహు చర్యపై ఇజ్రాయిల్‌ ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాలస్తీనాకు అండగా నిలబడితే.. ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టుగా మోడీ ప్రభుత్వం వాదించడం సిగ్గుచేటు అన్నారు. . ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించినా, విమర్శించినా ఉగ్రవాది అని ముద్ర వేసి జైలులో పెడుతున్నారు. కాశ్మీరీయులపైన జర్నలిస్టులపైన,, ప్రతిపక్ష నేతలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి నయా ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా 1948లో రెండు దేశాల ఏర్పాటుకు సిపిఐ(ఎం) మద్దతు ఇస్తుందని అన్నారు. ''పాలస్తీనీయుల పోరాటాన్ని యూదులకు ముస్లింలకు మధ్య పోరాటంగా ఇక్కడి వారి అనుచరులు చిత్రిస్తున్నారని, ఇది సరికాదని సిపిఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం అన్నారు ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా యూదులతో సహా వివిధ విశ్వాసాలకు చెందిన ప్రజలు ర్యాలీ చేస్తున్నారు. స్వతంత్ర పాలస్తీనా డిమాండ్‌కు మద్దతిచ్చే హిందూ ప్రగతిశీల వాదులు ఇజ్రాయెల్‌ ప్రజల కంటే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిలీయుల్లో చాలా మంది బహుళత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వలస పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు నిబద్ధతతో సాగించిన పోరాటాన్ని బిమన్‌ బసు గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అటువంటి దఢ సంకల్పం ఈరోజు మళ్లీ అవసరమని ఆయన అన్నారు.