Sep 01,2023 15:24

ప్రజాశక్తి -భీమవరం :ప్రజాశక్తి పత్రిక 42 వసంతాలు పూర్తిచేసుకుని 43వ వసంతంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని రానున్న రోజుల్లో ప్రజాశక్తి పత్రిక మరింత అభివృద్ధి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పి. ప్రశాంతి ఆకాంక్షించారు. ప్రజాశక్తి 43 వార్షికోత్సవం భీమవరం డివిజన్‌ ప్రత్యేక సంచికను స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ప్రజాశక్తి పత్రిక ముందుకు సాగాలన్నారు. ప్రజా సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారానికి ప్రజాశక్తి కఅషి చేయాలన్నారు. అటువంటి సమస్యలు అధికారుల దృష్టికి కూడా తీసుకురావాలని తద్వారా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వాస్తవాలపై కేంద్రీకరించి పత్రికల్లో ప్రచురిస్తే ప్రజాధరణ మరింత పెరుగుతుందని ప్రజల్లో కూడా పత్రిక పట్ల ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడుతుందన్నారు. పత్రికలలో ప్రజాశక్తి పత్రికకు తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని భవిష్యత్తులో దాన్ని కొనసాగించే విధంగా యాజమాన్యం, సిబ్బంది పత్రిక విలేకరులు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో పత్రిక మరింత అభివృద్ధి సాధించి మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ సందర్భంగా పత్రిక యాజమాన్యం, సిబ్బంది, విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి జెడ్‌ వెంకటేశ్వరరావు, ప్రజాశక్తి జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌, డెస్క్‌ ఇంచార్జ్‌ వెండ్ర శివప్రసాద్‌ , ఎడివిటీ జిల్లా ఇంచార్జ్‌ పెనుమత్స నారాయణరాజు , భీమవరం జిల్లా కేంద్రం విలేఖరి ఉండ్రు నరేష్‌, భీమవరం రూరల్‌ , ఆకివీడు విలేకరులు గూడూరు నాగరాజు ,జి. వెంకటేశ్వరరావు, ఏడివిటీ డివిజన్‌ ఇంచార్జ్‌ సాయి , సర్కులేషన్‌ ఇంచార్జ్‌ పెద్దిరాజు పాల్గొన్నారు