Aug 25,2023 22:22

న్యూయార్క్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద ఫిడే చెస్‌ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) తాజాగా విడుదల చేసి ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞానంద కెరీర్‌ బెస్ట్‌ 20వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇటీల ముగిసిన ప్రపంచకప్‌ చెస్‌ రన్నరప్‌గా నిలిచిన 18ఏళ్ల ప్రజ్ఞానంద 2727.2 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ప్రజ్ఞానందతో పాటు మరో ఇద్దరు భారతీయులు టాప్‌ 20లో చోటు దక్కించుకున్నారు. యువ గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ 8వ స్థానంలో, విశ్వనాథన్‌ ఆనంద్‌ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ప్రపంచ చాంపియన్‌, నార్వేకు చెందిన మాగస్‌ కార్ల్‌సన్‌ 2838.8 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.