అవనిపై గుట్టలు గుట్టలుగా
అవని లోపల పొరలు పొరలుగా
జలముపై తెప్పలు తెప్పలుగా
పేరుకుపోతున్న ప్లాస్టిక్....
నింగి, నేల, నీటిని కలుషితం చేస్తూ
పర్యావరణాన్ని పాడుచేస్తూ
ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తూ
మనిషి మనుగడకే ముప్పుని సృష్టిస్తోంది!
ఉపేక్షిస్తే..
రోజురోజుకీ కొండలా పెరిగిపోతూ
భూగోళాన్నే విషవలయంలో బంధిస్తుంది!
జీవనానికి ఉపద్రవం తెచ్చే పెనుభూతమై
ప్రాణికోటినే కబళించేస్తుంది!!
అందుకే..
నిషేధిద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని
తుదముట్టిద్దాం ప్రమాదకర భూతాన్ని!
నిర్మిద్దాం ప్లాస్టిక్ లేని ప్రపంచాన్ని !!
పి. సాన్విక
8వ తరగతి,
సెయింట్ పీటర్స్‌స్కూల్,
బోయినపల్లి, సికింద్రాబాద్.