Nov 12,2023 16:41

ప్లాస్టిక్‌... మన నిత్య జీవితంలో బకెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ ప్లాస్టిక్‌ అనేది కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్‌ వస్తువుల కన్నా ప్లాస్టిక్‌ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్‌ చేసే అవకాశం లేక పోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం ఎదురువు తుందని పర్యావరణ హితులు భయపడుతున్నారు.
ప్లాస్ట్టిక్‌ అనే పదం ప్లాస్టికోన్‌ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. దీనిని మొదటిసారి అలెగ్జాండర్‌ పార్క్స్‌ అన్నే బ్రిటీష్‌ శాస్త్రవేత్త తయారు చేశాడు. దీనిని క్రూడ్‌ ఆయిల్‌తో తయారు చేస్తారు. అంటే ముడిచమురు అన్నమాట. దీనిని సుమారు 400 సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు వేడిచేస్తారు. అందులో వచ్చే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 ఉష్ణోగ్రత వరకు వేడిచేసి, తరువాత 200 ఉష్ణోగ్రతకు చల్లబస్తారు. ఇలా చేసినప్పుడు శక్తివంతమైన 'పాలిమర్స్‌ 'అనే అణువుల గొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా ప్లాస్టిక్‌ తయారవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. ప్రాథమికంగా ప్లాస్టిక్‌ హానికరమైనది కాదు. కాని ప్లాస్టిక్‌ సంచుల తయారీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రమాదకరమైన రసాయన రంగులు, థాలో సైనిక్‌ పిగ్మెంట్లు కలుపుతున్నారు. వీటిలో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు, సరికదా భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని జంతువులు తిని ఆనారోగ్యాల బారిన పడుతున్నాయి.
ప్రతి సంవత్సరం 2 మిలియన్ల పక్షులు, సముద్రజీవులు, కేవలం ఈ ప్లాస్టిక్‌ వలన మరణిస్తున్నాయి. అందుకే ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించడం మంచిది. వాటి స్థానంలో జనపనార సంచుల వాడకాన్ని పెంచాలి.
బ్రిటన్‌, జపాన్‌ లలో ''స్పడ్‌ బ్యాగ్‌లు''గా పిలిచే బంగాళ దుంపలతో చేసిన సంచులను వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్‌ కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. బంగాళ దుంప నుండి తయారు చేసే స్టార్చ్‌కు బయో పాలిమర్‌ ప్లాస్టిక్‌ లక్షణాలు ఉంటాయి. దీనికి భూమిలో కరిగిపోయే గుణం చాలా ఎక్కువ, కనుక హానికరం కాదు కావాలి అనుకుంటే రీసైక్లిన్‌ పద్ధ్దతిలో కొత్త వస్తువులు తయారు చేసుకోవచ్చు.
Plastic-means...
 

టి.ఎస్‌ హర్షిత
10వ తరగతి
ఎల్‌. ఆర్‌ జి విద్యాలయం
కిరికేరా, హిందూపురం