Oct 20,2023 08:23

నాటండోయ్ ....నాటండి
మొక్కలనే ...నాటండి
మన చుట్టూ పరిసరాలను
పచ్చంగా ఉంచండి
మొక్కలే కదా జీవాధారం
మొక్కలే కదా ప్రాణాధారం

ఆహారాన్ని ఇచ్చే మొక్కలు
ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు
మొక్కలలో మూడు రకాలు
తీగలు,పొదలు, వృక్షాలు

ఆవాసాన్ని ఇచ్చే మొక్కలు
ఉపకరణాలను ఇచ్చే మొక్కలు
మొక్కలలో మూడు రకాలు
తీగలు ,పొదలు, వృక్షాలు
వర్షాలను ఇచ్చే మొక్కలు
ప్రాణ వాయువు ఇచ్చే మొక్కలు
మొక్కలలో మూడు రకాలు
తీగలు ,పొదలు, వృక్షాలు

- కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77240.