ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : రూరల్ గ్రామం బుర్రిపాలెం సర్పంచ్ పదవికి, హాఫ్ పేట పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంటతో పోలింగ్ ముగుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని బుర్రిపాలెం గ్రామంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పర్యటించి పరిశీలించారు. ఇప్పటివరకు బుర్రిపాలెం లో 2750ఓట్లకు గాను 1092 ఓట్లు, హాఫ్ పేట లో 157ఓట్లకు గాను 33 ఓట్లు పోలయ్యాయి.










