
వాతావరణం మారిన వెంటనే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురౌతుంటారు. వైరల్ జ్వరం, జలుబు-దగ్గు, ఇన్ఫెక్షన్, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడటం మొదలౌతుంది. పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్లే ఇది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, క్రీడల పట్ల అవగాహన కల్పించాలి.
- ఉదయం వేళ తేలికపాటి వ్యాయామం చేయడాన్ని పిల్లలకు అలవర్చాలి. దీని వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
- చిన్న పిల్లలకు నిద్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా 12 ఏళ్లలోపు పిల్లలు కనీసం 9 గంటలు నిద్రపోవాలి. నిద్ర పిల్లల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
- పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. పిల్లల ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ తగిన మోతాదులో అందాలి.
- పండ్లు, కూరగాయలు, పాలు, పప్పులు, గుడ్లు వంటి పౌష్టికాహారం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
- పిల్లలకు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని నేర్పించాలి.
- చలికాలంలో పిల్లలు స్నానం చేయడానికి వెనకాడతారు. కానీ చలిగా ఉన్నా పిల్లలకు ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి.