
ముంబయి: ప్రొ కబడ్డీ సీజన్-10 తొలిరోజు వేలంలో భారత జట్టు కెప్టెన్ పవన్ కుమార్ షెరావత్ రికార్డు ధర పలికాడు. సోమవారం జియో వరల్డ్ కన్వెషన్ సెంటర్‌లో జరిగిన వేలంలో ఏకంగా రూ.2.61కోట్లకు తెలుగు టైటాన్స్ చేజిక్కించుకుంది. షెరావత్‌ను కొనుగోలు చేసేందుకు 10 ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీపడ్డాయి. ఆ తర్వాత మహ్మద్రేజా షడ్లోరును రూ.2.35కోట్లకుపుణేరి పల్టన్ దక్కించుకుంది. దీంతో తొలిరోజు అత్యధిక ధర పలికన విదేశీ ఆటగాడుగా షడ్లోరు(ఇరాన్) నిలిచాడు. ఏ కేటగిరీలో హర్యానాకు చెంందిన రోహిత్ గులియా, విజరు మాలిక్‌తోపాటు, మణిందర్ సింగ్(పంజాబ్), మంజిత్ ఛిల్లర్(ఢిల్లీ) నిలి చినా.. మణిందర్ సింగ్ రూ.2.12కోట్ల మూడో అత్యధిక ధరకు బెంగాల్ వారియ ర్స్ కొనుగోలు చేసింది. సి కేటగిరీ ఆటగాళ్లు వేలం రేసులో రికార్డు ధరకు పలికారు.
తొలిరోజు వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు...
1. పవన్‌కుమార్ షెరావత్ రూ.2.61కోట్లు (తెలుగు టైటాన్స్)
2. మహ్మద్‌ద్రేజా షడ్లోరు రూ.2.35కోట్లు (పుణేరి పల్టన్స్)
3. పవన్ షెహ్రావత్ రూ.2.20కోట్లు (తమిళ్ తలైవాస్)
4. మణిందర్ సింగ్ రూ.2.12కోట్లు (బెంగాల్ వారియర్స్)
5. ఫజల్ అత్రాచలి రూ.1.60కోట్లు (గుజరాత్ జెయింట్స్)