అమరావతి : అన్నయ్య నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల వివాహం సందర్భంగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీకి ప్రయాణమయ్యారు. నవంబర్ 1వ తేదీన మెగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు పవన్ తన భార్యతో కలిసి ఇటలీకి ప్రయాణమయ్యారు.