అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నెం1కు చేరుకుంది. శ్రీలంక వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. మళ్లీ నెం1 వన్డే జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి బాబర్ సేన టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాగా 118 రేటింగ్‌తో పాక్ -ఆస్ట్రేలియా జట్లు సమం ఉన్నాయి. అయితే పాయిట్లు పరంగా ఆస్ట్రేలియా(2714) కంటే పాకిస్తాన్(2725) ముందంజలో ఉండడంతో అగ్రపీఠాన్ని సొంతం చేసుకుంది. మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది. రేటింగ్స్ పరంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది. ఇక న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,శ్రీలంక, ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్ నిలిచాయి.










