Sep 13,2023 09:00

మా పల్లె అందాలు
చూడగా రారండి
ఒక్కసారి చూస్తే
వదిలిపోలేరండి !

పచ్చని పంటలు
మెండుగా తోటలు
పారుతూ ఏరులు
మా పల్లె సీమలు !

గోవులు, మేకలు
పాలిచ్చు నేస్తాలు
మా పల్లె రైతులకు
చేదోడు వాదోడు !

కొక్కోరొక్కో అంటూ
కోడిపుంజుల కూత
కుహు కుహు అంటూ
కోయిలమ్మల పాట
అంబా అంబా అంటూ
తువ్వాయి గెంతాట
అదిచూస్తే చాలును
మనసంత పులకింత !

పండగలు పబ్బాలు
జాతరలు తిరునాళ్ళు
ఘన సంప్రదాయాలు
పల్లెకు పెట్టింధి పేరు !

వారం వారం సంత
మా పల్లెలో నంట
దొరకనిది లేదంట
కూడేరు ప్రజలంతా !

చల్ల చల్లని గాలి
రొదలు లేని హాయి
కాలుష్యమన్నది
కానరాదట నోయి.

స్నేహానికే ప్రాణ
మిచ్చే మా పల్లెవారు
కల్లలే ఎరుగని ప్రేమ
పంచే తీరు

పల్లె మనకు తల్లి
ప్రగతికి మరుమల్లి
ప్రతిన పూని మనం
రక్షించుకోవాలి !
 

- కూచిమంచి నాగేంద్ర,
9182127880.