Oct 15,2023 08:36

న్యూఢిల్లీ : ఆపరేషన్‌ అజయ్ లో భాగంగా... మూడో విమానంలో 197 మంది స్వదేశానికి క్షేమంగా చేరుకున్నారు. ఇజ్రాయిల్‌ నుండి ఆదివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయులకు జాతీయ జెండాలనిచ్చి కేంద్ర మంత్రి కౌషల్‌ కిషోర్‌ స్వదేశానికి స్వాగతం పలికారు. భీకర పోరు మధ్య సంక్షోభంలో ఉన్న తమను క్షేమంగా స్వదేశానికి తెచ్చినందుకు వారంతా కేంద్ర ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధ పోరు తీవ్రతరం అవుతోన్న వేళ ... ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత్‌ ఆపరేషన్‌ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి, రెండవ విమానాల్లో 212, 235 మందిని వరుసగా ఇండియాకి తరలించారు. మూడో విమానంలో ఈరోజు 197 మంది చేరుకున్నారు. నాలుగో విమానం 274 మందితో టెక్‌ అవీవ్‌ నుంచి శనివారం రాత్రి 11:45 గంటలకి ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటివరకు దాదాపు 918 మంది స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్‌ అజరులో భాగంగా ఈ రెండు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్‌ఇండియా విమానం, అమఅత్‌సర్‌ నుంచి స్పైస్‌జెట్‌ విమానం బయలుదేరనున్నాయి.