ప్రజాశక్తి-వన్ టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు శనివారంతో ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేటి నుంచి భవాని దీక్షాదారులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.










