May 11,2023 16:50

ప్రజాశక్తి-పాకాల(తిరుపతి) :మండలంలోని పుదిపుట్లబైలులో వర్షాల కారణంగా దెబ్బ తిన్న టమాట, మామిడి పంటలను క్షేత్రస్థాయిలో జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ బి.సరస్వతి, తిరుపతి జిల్లా ఉద్యాన అధికారి బి.దసరదరామిరెడ్డిలు గురువారం పరిశీలించారు. ఉద్యాన అధికారిణి ఎస్‌.శైలజ ఉద్యాన శాఖ ద్వారా రైతు సంఘాలు నిర్మించుకునే కలెక్షన్‌ సెంటర్స్‌ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల ఉద్యాన అధికారిణి ఎస్‌.శైలజ, గ్రామ ఉద్యాన సయాయకురాలు వనజ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.