Aug 14,2023 09:50

ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలు గల ఆహారం. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు ఒక్కతోట కూరలోనే లభిస్తాయి. తోటకూరలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలతోపాటుగా గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. రోజూ తోట కూర తింటే బరువు తగ్గుతారు. పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచటం పాటు తక్షణశక్తి అందిస్తుంది. వేపుడు కంటే ఉడికించుకుని తింటేనే ప్రొటీన్లు శరీరానికి బాగా అందుతాయి. అధిక రక్తపోటు నియంత్రణకు తోటకూర దోహదపడుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. విటమిన్‌-సి ఉంటుంది. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది. ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది.