Aug 09,2023 17:53

ప్రజాశక్తి-మాడుగుల(అనకాపల్లి) : నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసి గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలని ఆదివాసి గిరిజన సంఘం ప్రతినిధులు ఇరట. నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం కె భవాని చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసి హక్కుల దినంగా నిర్వహించాలని గిరిజన సంఘం పిలుపుమేరకు మాడుగుల మండలంలో జాలంపల్లి పంచాయతీలో రాయిపాలెం గ్రామంలో బుధవారం ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ఆదివాసి హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.