ఛండీగడ్: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.. సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'శ్రీలంకతో జరిగిన మూడో టి20లో సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ని వర్ణించాలంటే నాకు మాటలు రావడం లేదు. అతడు సచిన్, రోహిత్, కోహ్లీల సరసన ఏదో ఒకరోజు చేరుతాడేమోనని అనిపిస్తోంది. సూర్యకుమార్ ఫైన్ లెగ్ మీదుగా ఆడే ల్యాప్‌షాట్ బౌలర్‌ను భయపెడుతుంది. అతడు నిలబడి మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్ ఎటువంటి బంతి వేస్తాడో కచ్చితంగా అంచనా వేస్తాడు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రికీ పాంటింగ్ వంటి గొప్ప గొప్ప బ్యాటర్లను చూశాను. కానీ కొందరు మాత్రమే అతడిలా బంతిని క్లీన్‌గా కొట్టగలరు. హ్యాట్సాఫ్ సూర్యకుమార్ యాదవ్. ఇలాంటి ఆటగాళ్లను వందేళ్లకు ఒకసారి మాత్రమే చూస్తాం' అని కపిల్‌దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు.