Oct 17,2023 10:24

ప్రయాగ్‌రాజ్‌ : నోయిడాలో నిఠారీ సీరియల్‌ కిల్లింగ్స్‌ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సురేందర్‌ కోలి, మనీందర్‌ సింగ్‌ పంథేర్‌ను అలహాబాద్‌ హైకోర్టు సోమవారం నిర్ధోషులుగా ప్రకటించింది. గతంలో వీరికి హత్య, అత్యాచారం ఆరోపణలతో ఉరిశిక్ష విధించారు. 2006 డిసెంబరు 29న నోయిడాలోని నిఠారీలో వ్యాపారవేత్త పంథేర్‌ ఇంటి ప్రాంగణంలో 19 మృతదేహాలు వెలుగుచూడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై 2007లో పంథేర్‌, ఆ ఇంటి పనివాడు కోలీపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2017లో సిబిఐ ప్రత్యేక కోర్టు కోలి, పంథేర్‌కు మరణ శిక్ష విధించింది. దీనిపై ఇద్దరూ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు.