ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : జవహార్ నవోదయకు మండలంలోని చెముడులంక నేతాజీ (ఈఎమ్) స్కూల్ విద్యార్థిని కర్రి కీర్తి శ్రీవల్లి దేవి ఎంపికయినట్లు నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ యెరుబండి శ్రీనివాసు తెలిపారు. ఆ విద్యార్థినికి ఆదివారం స్కూల్ వద్ద అభినందన సభ నిర్వహించారు. కీర్తి శ్రీవల్లి దేవి ఎల్కేజీ నుండి నేతాజీ స్కూల్ లోనే విద్యను అభ్యసిస్తూ ఈ ఘనత సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అర్థమెటిక్, రీజనింగ్ ఇంగ్లీష్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో తను జవహార్ నవోదయలో ఉతీర్ణురాలు అయినట్లు విద్యార్థిని కీర్తి తెలిపింది. లాభాపేక్ష లేకుండా అన్ని సామాజికవర్గాల ప్రజలకు విద్యను అందుబాటులోకి తెస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు పంపిస్తున్న నేతాజీ స్కూల్ యాజమాన్యాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సత్యనారాయణ, పాఠశాల ఇంచార్జి పద్మావతి, ప్రిన్సిపాల్ సునంద, టీచర్లు ప్రవీణ, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.










