ప్రజాశక్తి-కోట(తిరుపతి) : కోటమండలం విద్యానగర్‌లోని ఎన్‌బికే ఆర్‌ఐ ఎస్టీలో ఏప్రిల్ 12వ తేదిన సైన్స్ అండ్ హ్యమానిటీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ''సృజనా 2123'' అనే జాతీయ స్థాయి సదస్సును నిర్వషిస్తున్నట్లు ఎన్‌బికేఆర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుకు రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ చదివిన కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌లో గణితశాస్త్రానికి సంబంధించిన ఉపయోగాల గురించి, భౌతిక రసాయన శాస్త్రాలలోని సాంకేతికానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు గురించి కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంబంధించి వ్యాసాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ వ్యాసాలకు ప్రథమ, ద్వితీయ బహుతులను ఇవ్వడం జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సి.రవీంద్రా రెడ్డి,సదస్సు కన్వీనర్ డాక్టర్ యం.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.










