Aug 12,2023 15:22

ప్రజాశక్తి -ఉంగుటూరు : నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2023 లో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థిని కురిటి హేమలత వెళ్ళూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వి.ఐ.టి) డ్రీమ్డ్‌ విశ్వవిద్యాలయం లో నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు చదివేందుకు ఫ్రీ సీటు కి ఆర్హత సాధించినట్లు నారాయణపురం కళాశాల ప్రిన్సిపాల్‌ బివి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. హేమలత నారాయణపురం కాలేజీలో ఎం పి సీ గ్రూపులో 1000 / 931 మార్కులు సాధించి జిల్లాస్థాయి బ్రిలియంట్‌ అవార్డు తీసుకుంది. ఈ క్రమంలో ఇంటర్లో మంచి మార్కులు సాధించిన కారణంగా విఐటిలో నాలుగేళ్లపాటు ఉచితంగా హాస్టల్‌ వసతి కల్పించి ఇంజనీరింగ్‌ విద్యను చదివేందుకు అవకాశం కల్పిస్తూ హేమలత ను ఎంపిక చేశారు . ఈనెల 17న అమరావతి లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. హేమలత తల్లిదండ్రులు నారాయణపురంలో వ్యవసాయ కూలీలు. కష్టపడి మంచి మార్కులు సాధించి ఏలూరు జిల్లా నుండి హేమలత ఒక్కరే విఐటికి ఎంపి కావటం పట్ల డివిఈవో ప్రభాకర్రావు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.