Oct 23,2023 12:27

అమరావతి : తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ... నారా భువనేశ్వరి, లోకేశ్‌ ఎక్స్‌ (ట్వీట్‌) చేశారు.

రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నానని నారా భువనేశ్వరి అన్నారు. నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరమని లోకేశ్‌ అన్నారు. చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశమన్నారు. ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోన్న జగనాసురుడి పాలన అంతమే పంతంగా అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ లోకేశ్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు.