Oct 25,2023 13:20

తమిళనాడు : ప్రముఖ నటుడు హీరో రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు తన 170వ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. 'జైభీమ్‌' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమయింది. కేరళలోని తిరువనంతపురంలోని అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్‌ను రజనీకాంత్‌ వెల్లడించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారనీ, తాజాగా షూటింగ్‌ లో ఆయన జాయినయ్యారనీ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా రజనీకాంత్‌ తెలియజేస్తూ... '' నా మెంటార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తో 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్నా.. నా హృదయం ఆనందంతో కొట్టుకుంటోంది '' అని తెలిపారు.

After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s "Thalaivar 170" directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y

;