Aug 15,2023 10:44

ఎగిరింది ఎగిరింది మన జెండా
నింపింది మోదమే మది నిండా
ఎందరో త్యాగధనుల సాక్షిగా
నింగిలో విహరించే హాయిగా ...

మదిని సమరయోధులను స్మరిస్తూ
ఆత్మ బలిదానాలు వివరిస్తూ
ఎత్తండి పైపైకి ఘన జెండా
మన జాతి గౌరవం ఈ జెండా

మువ్వన్నెల ముచ్చటైన జెండా
ముసిముసి నవ్వుల వెలుగుల జెండా
శాంతి,స్వేచ్ఛ, క్షేమములకు ప్రతీక
పింగళి వెంకయ్య చేసిన జ్ఞాపిక

కొలవాలి కొలవాలి గుండెల్లో
జాతీయ జెండాను మనమంతా
చాటాలి చాటాలి దేశకీర్తి
చేయిచేయి కల్పి జగమంతా!
 

- గద్వాల సోమన్న