
ప్రజాశక్తి -గణపవరం:ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ వినియోగించుకోవాలని గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి సంతోష్ నాయుడు అన్నారు. శనివారం అర్థవరంలో జరిగిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు పేర్లు నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీప,ీ షుగర్ ఉన్న రోగులకు మందులు అందజేశారు. సిహెచ్‌ఓ విల్సన్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో 35 ఏళ్లు దాటిన వారందరూ ఫ్యామిలీ పిజిషన్‌కు వచ్చి వైద్యం పొందాలని అన్నారు. ఆరోగ్య రక్షణకు పోషక విలువ గల ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి లు దివ్యభారతి, ఏఎన్‌ఎం ఈ లక్ష్మీకాంతం, హెల్త్ అసిస్టెంట్ బి రవికుమార్, 104 సిబ్బంది బి శ్రీనివాస్, ఎ రవి పాల్గొన్నారు.