Nov 21,2023 12:25

ప్రకాశం : మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ... ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం వంటావార్పు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు ప్రసంగించారు. వర్షం కురుస్తున్నప్పటికీ నిరసన కొనసాగుతోంది. తమ సమస్యలను అధికారులు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికులు కోరుతున్నారు.